తెలంగాణ

telangana

ETV Bharat / state

హైటెన్షన్​ విద్యుత్​ స్తంభం ఎక్కి ఓ వ్యక్తి హల్​చల్​ - medchal news

ఓ వ్యక్తి హైటెన్షన్​ విద్యుత్​ స్తంభం ఎక్కిన ఘటన మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​లో జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని కాపాడారు.

Man Climb High Tension electrical pole in medchal district
హైటెన్షన్​ విద్యుత్​ స్తంభం ఎక్కి ఓ వ్యక్తి హల్​చల్​

By

Published : Feb 27, 2020, 9:47 AM IST

ఓ వ్యక్తి హైటెన్షన్​ విద్యుత్​ స్తంభం ఎక్కిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్​నగర్ ఆదర్శ్​నగర్​లో జరిగింది. స్థానికంగా నివసించే రాజు స్తంభం ఎక్కాడనే సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడ్ని బుజ్జగించి కిందికి దింపారు. పోలీసులు కొంచెం ఆలస్యంగా వచ్చినా... అతని ప్రాణాలు పోయేవని స్థానికులు తెలిపారు.

కాలనీకి చెందిన ఓ వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడం వల్లే చనిపోవాలని అనుకున్నానని రాజు పోలీసులకు తెలిపాడు. అనంతరం రాజును కుటుంబసభ్యులకు అప్పగించారు.

హైటెన్షన్​ విద్యుత్​ స్తంభం ఎక్కి ఓ వ్యక్తి హల్​చల్​

ఇవీ చూడండి: 'జ్వరంతో మరణిస్తే.. ఆత్మహత్యగా చిత్రీకరించారు'

ABOUT THE AUTHOR

...view details