హైదరాబాద్‌లో లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన సినీనటుడు హీరో నిఖిల్‌కు చెందిన రేంజ్ రోవర్ కారుకు కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు కనిపించింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా సినీ నటుడు నిఖిల్‌కు చెందిన కారు అని పోలీసులకు తెలిపారు..
Hero Nikhil: హీరో నిఖిల్ కారుకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు - challan for hero nikhil car
లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను అతిక్రమించి రోడ్డుపైకి వచ్చిన హీరో నిఖిల్ కారుకు కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. నంబర్ ప్లేటు కూడా సరిగా లేకపోవడంతో మరో చలానా విధించి పంపించివేశారు. అయితే ఆ సమయంలో హీరో కారులో లేడని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ ఫోన్‌తో హీరో నిఖిల్‌తో పోలీసులు మాట్లాడారు.
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు హీరో నిఖిల్ కారుకు చలానా విధించిన పోలీసులు
హీరో వాహనం నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో పోలీసులు మరో చలనా విధించి అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం కారు తనదేనని ట్రాఫిక్ పోలీసులతో హీరో నిఖిల్ ఫోన్‌లో మాట్లాడారు.