KTR Inaugurates Cotelligent: సైబర్ క్రైమ్‌కు సైబర్ సెక్యూరిటీ పెద్ద సవాల్‌గా మారిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలో కొటెలిజెంట్ సైబర్ వారియర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఆయన ప్రారంభించారు. కొటేలిజెంట్ సెంటర్ ద్వారా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కొటేలిజెంట్ ఒప్పందం చేసుకుంది. ఉపాధి కల్పించేవారికి ప్రభుత్వాలు అండగా ఉండాలని కేటీఆర్ అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగానే ఉంటాయని పేర్కొన్నారు. భారతదేశంలో వందకోట్లకుపైగా జనాభా ఉందన్న కేటీఆర్... అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలని కేటీఆర్ సూచించారు.
KTR Inaugurates Cotelligent: 'భవిష్యత్తులో సైబర్ యుద్ధాలే జరుగుతాయి' - Koteligent Cyber Warrior Center of Excellence
KTR Inaugurates Cotelligent: రాయదుర్గంలో కొటెలిజెంట్ సైబర్ వారియర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కొటేలిజెంట్ సెంటర్ ద్వారా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నారు.
KTR Inaugurates Cotelligent
నైపుణ్యం ఉంటే ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందజేస్తామని కేటీఆర్ వివరించారు. డేటా ప్రొటెక్షన్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ఉండాల్సిందేనన్న కేటీఆర్... ప్రధాని ట్విటర్ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురైందని వెల్లడించారు. భవిష్యత్తులో సైబర్ యుద్ధాలే జరుగుతాయని సూచించారు.
ఇవీ చూడండి:
Last Updated : Dec 17, 2021, 3:16 PM IST