JP Nadda Fires on BRS :తెలంగాణలో కేసీఆర్ పాలన.. రజాకార్ల పాలనను తలపిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు.. ప్రజలు చరమగీతం పాడనున్నారని దుయ్యబట్టారు. భ్రష్టాచార్ రిస్తేదార్ సమితి అంటూ బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఔషాపూర్లోని వీబీఐటీ కళాశాలలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Kishan Reddy Fires on CM KCR : 'కమలం వికసిస్తుంటే.. కేసీఆర్ గడబిడ అవుతున్నారు'
JP Nadda Comments on Regional Parties :దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల్లో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. ప్రస్తుతం ప్రాంతీయ స్థాయికి పడిపోతోందని విమర్శించారు. నేడు దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ స్థాయికి ఎదుగుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు.
స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కేవలం భారత దేశంలోనే ఉందని నడ్డా పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్లలో రూ.9 లక్షల కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. కమలం వికసిస్తుంటే.. కేసీఆర్ భయపడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని దుయ్యబట్టారు. ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, జేఎంఎం, తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీలేనని విమర్శించారు.