తెలంగాణ

telangana

ETV Bharat / state

బండ చెరువు భూముల్లో ఆక్రమణలు.. సర్వేకు వెళ్లిన అధికారిపై దాడి

మల్కాజ్​గిరిలోని బండ చెరువు కింద ఉన్న ఎఫ్​టీఎల్​ భూముల్లో జరిగే ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన అసిస్టెంట్​ ఇంజినీర్​పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, సర్వే చేయడానికి వెళ్లిన అధికారులపై దాడి చేసినందుకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

illegal construction at banda cheruvu in medchal
బండ చెరువు భూముల్లో ఆక్రమణలు.. సర్వేకు వెళ్లిన అధికారిపై దాడి

By

Published : Jul 18, 2020, 12:12 PM IST

మేడ్చల్ జిల్లా మల్కాజ్​గిరి ఆనంద్ బాగ్​లోని బండ చెరువు కింద ఉన్న ఎఫ్​టీఎల్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదు మేరకు సర్వేకి వెళ్లిన అధికారులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. అక్కడ నిర్మాణాలు చేపడుతున్న యజమాని అల్లుడైన శ్రీహరి సర్వేకు వెళ్లిన అధికారులతో గొడవకు దిగాడు.

ఆవేశంతో కర్రతో ప్రభుత్వ ఉద్యోగి, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ వేంద వెంకట శ్రీనివాస్ రావు తలపై కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంజినీర్​కు తీవ్ర రక్తస్రావం జరగడం వల్ల హాస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details