కుటుంబ కలహాలతో భార్యను హతమార్చి భర్త పరారైన ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలో చోటుచేసుకుంది. భవానినగర్‌లో కొన్నాళ్లుగా నివాసం ఉంటున్న రాజ్‌కుమార్.. ఆర్ఎంపీ వైద్యుడు. భార్య శిల్ప, కుమార్తె, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య శిల్పతో గొడవ పడిన రాజ్‌కుమార్... మాటా మాటా పెరిగి క్షణికావేశంలో విచక్షణ మరిచి హతమార్చాడు.
మీ అత్తను కొట్టా.. బతికి ఉందో లేదో చూడు
మేడ్చల్ జిల్లా సూరారంలో శివారులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ గొడవలతో కట్టుకున్న భార్యను హతమార్చాడు ఓ భర్త. ఇద్దరు పిల్లల్ని అనాథల్ని చేసి పరారయ్యాడు.
మేడ్చల్‌లో భార్యను హతమార్చిన భర్త
ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్‌కుమార్.. తన అల్లుడైన హరీశ్‌కు ఫోన్ చేసి మీ అత్తను కొట్టానని.. ఆమె బతికి ఉందో లేదో వెళ్లి చూడమని చెప్పినట్లు తెలుస్తోంది. హరీశ్ వెళ్లి చూడగా.. అప్పటికే శిల్ప మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాజ్‌కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
Last Updated : Nov 12, 2019, 8:00 PM IST