మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్‌లో 101 ఏళ్ల వయస్సుగల వృద్ధురాలు రాములమ్మ తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు హక్కు వచ్చినప్పడి నుంచి ప్రతి ఎన్నికలో తప్పకుండా ఓటు వేస్తున్నాని తెలిపింది.
దుండిగల్ పురపాలికలో ఓటు వేసిన 101 ఏళ్ల బామ్మ - hundred years old women casted her vote at dundigal
ఓటు వేయడం ఎంత ముఖ్యమో.. మేడ్చల్ జిల్లా దుండిగల్ పురపాలిక పరిధిలోని బౌరంపేట్‌లో 101 ఏళ్ల ఓ వృద్ధురాలిని చూస్తే తెలుస్తుంది. 100 ఏళ్లు పైబడినా... శరీరం సహకరించకున్నా వీల్‌ఛైర్‌లో వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకుంది. అదే పురపాలికలోని మరో ప్రాంతంలో 80 ఏళ్ల బామ్మ ఓటు వేసింది. ఈ వృద్ధురాళ్లిద్దరు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
దుండిగల్ పురపాలికలో ఓటు వేసిన 101 ఏళ్ల బామ్మ
ఇదే పురపాలికలోని మరో ప్రాంతంలో 80 ఏళ్ల బామ్మ వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది.
నేటి తరం యువతరానికి వీరు ఆదర్శంగా నిలిచారు. ఈ ఒక్కరోజు ఓటు వేయకుంటే మరో ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
- ఇదీ చూడండి : నీ కాళ్లు మొక్కుతా..నాకే ఓటేయండి..