ద్విచక్రవాహనాన్ని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల యువతి మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా హైదర్‌నగర్‌లో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని హైదర్‌నగర్ ప్రధాన రహదారిపై ఉదయం డ్రైవ్ ఈజీ ద్వారా స్కూటీని బుక్ చేసుకొని మియాపూర్ నుంచి కూకట్పల్లి వైపుగా వస్తుంది. అదే సమయంలో వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల యువతి కిందపడింది. ఆమె తలకు బలమైన గాయం కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్.. యువతి మృతి - crime news
మేడ్చల్ జిల్లా హైదర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వాటర్‌ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్.. యువతి మృతి
వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
ఇవీ చూడండి: డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు