మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్ నాలా సమస్యలపై ట్విట్టర్, టెలిఫోన్లో ఫిర్యాదులు రావటంతో జీహెచ్ఎంసీ మేయర్(Mayor) గద్వాల విజయ లక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. గణేష్‌నగర్‌లో పాదయాత్ర చేసి వర్షపు నీటి నాలాను పరిశీలించిన అనంతరం వర్షాకాలంలో వరద సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Mayor: యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి: విజయలక్ష్మి - జీహెచ్ఎంసీ తాజా వార్తలు
ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ మేయర్(Mayor) గద్వాల విజయ లక్ష్మి అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్ నాలా సమస్యలపై ట్విట్టర్, టెలిఫోన్లో ఫిర్యాదులు రావటంతో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.
జీహెచ్ఎంసీ, మేయర్గ ద్వాల విజయ లక్ష్మి
వరద నీరు పొంగి పొర్లకుండా సాఫీగా వెళ్లేందుకు నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, వెడల్పు పనులకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో భారీ వరదలు సంభవించినప్పుడు ప్రజలు పడ్డ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, నాలాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని తెలిపారు.