మేడ్చల్ జిల్లా గాజులరామరానికి చెందిన రత్నరాజు అనే మహిళ తమ కాలనీలో ఉన్న చెరువు చుట్టు వాకింగ్ ట్రాక్ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. గత కొన్నేళ్లుగా చెరువు కబ్జాలకు గురవుతుందని తన ట్వీట్లో పేర్కొన్నారు. స్పందించిన మంత్రి.. మేయర్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ రాజును చెరువును పరిశీలించాలని కోరారు. కేటీఆర్ కోరిక మేరకు జీహెచ్ఎంసీ మేయర్(GHMC) అధికారులతో కలిసి ఈరోజు గాజులరామరంలో ఉన్న మూడు చెరువులు, మియావాకి పార్కును పరిశీలించారు.
GHMC Mayor: గాజులరామరంలో మేయర్ విజయలక్ష్మి - జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తాజా వార్తలు
జీహెచ్ఎంసీ(GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మి గాజులరామరంలో ఉన్న మూడు చెరువులను పరిశీలించారు. చెరువు కింద ఉన్న వొక్షిత్ ఎన్క్లేవ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటైన కాలనీలోకి వర్షపు నీరు వస్తుందని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు.
మేయర్ విజయలక్ష్మి
అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. చెరువు కింద ఉన్న వొక్షిత్ ఎన్క్లేవ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటైన కాలనీలోకి వర్షపు నీరు వస్తుందని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాలు మీటింగ్లో చర్చిస్తామని విజయలక్ష్మి తెలిపారు.
ఇదీ చదవండి:Lock Down : సడలింపు సమయంలో కిటకిట.. లాక్డౌన్లో స్తబ్ధత