మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పటేల్ నగర్లో అధికారుల ఆదేశాల మేరకు నాలాలపై కట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వయంగా పేద ప్రజలను ఒప్పించి నాలాలపై కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయిస్తున్నారు.
మల్కాజిగిరి అభివృద్ధికి నా ఆస్తులైనా అమ్ముతా: మైనంపల్లి
మల్కాజిగిరిని అభివృద్ధి చెయ్యడానికి తన ఆస్తులు అమ్ముతానని ఎమ్మెల్యే మైనంపల్లి ప్రమాణం చేశారు. పటేల్‌నగర్‌లో అధికారుల ఆదేశాలతో నాలాలపై కట్టిన అక్రమ భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు. నష్టపోయిన పేద ప్రజలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మల్కాజిగిరి అభివృద్ధికి నా ఆస్తులైనా అమ్ముతా: ఎమ్మెల్యే మైనంపల్లి
ప్రభుత్వం ఇచ్చే సాయంతో పాటు తన ఆస్తులను అమ్మి రూ.20 కోట్లను పేద ప్రజలకు అందజేస్తానని ఎమ్మెల్యే ప్రమాణం చేశారు. ప్రజలందరూ సహకరిస్తే తాను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఇదీ చదవండి:జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల కూల్చివేత