మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని ఏం చేశారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సీఎం దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న రెండు రోజుల దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షలో పొన్నాల పాల్గొన్నారు. దత్తత అంటే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని.. కాంగ్రెస్ హయాంలో చాలా గ్రామాలు చేసి చూపించామని పొన్నాల వివరించారు. సీఎం ఒక్క వర్గానికే డబ్బులిస్తామని చెప్పడం అవివేకమన్నారు. కేసీఆర్ చేసిన ద్రోహానికి చరిత్ర క్షమించదని ఆరోపించారు. సీబీఐ 2014లోనే కేసీఆర్‌పై మూడు కేసులున్నాయని ప్రకటించిందన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్కు జైలు జీవితమేనని తెలిపారు. వరంగల్ కొత్త జైలు కేసీఆర్ కోసమే కట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.
Ponnala laxmaiah: 'కేసీఆర్‌పై ఎన్ని కేసులున్నాయో.. సీబీఐ 2014లోనే ప్రకటించింది'
రేవంత్ వచ్చాక కాంగ్రెస్కు కొత్త ఉత్సహం వచ్చిందని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మూడు చింతలపల్లిని దత్తత తీసుకున్న సీఎం.. ఈ ఊరికి ఏం చేశారని ప్రశ్నించారు.
ponnala