తెలంగాణ

telangana

ETV Bharat / state

'చాలీచాలని జీతాలు.. అందులో కోతలు.. ఎలా బతకాలి?' - Medchal district news

కింది స్థాయి ఉద్యోగుల నుంచి పైస్థాయి ఉద్యోగులు నెల జీతంలో డబ్బులు తీసుకుంటున్నారని ఓ మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది.

'చాలీచాలని జీతాలు అందులో కోతలు.. ఎలా బతకాలి?'
'చాలీచాలని జీతాలు అందులో కోతలు.. ఎలా బతకాలి?'

By

Published : Oct 21, 2020, 3:36 PM IST

హైదరాబాద్ కాప్రా గాంధీనగర్ అపోలో ఫార్మసీలో ఎగ్జిక్యూటివ్ సిబ్బంది జీతాలు సరిగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఓ యువతి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కింది స్థాయి ఉద్యోగుల జీతాల్లో నుంచి కోత పేరుతో ప్రతి నెల రూ. 5 వేల నుంచి 8 వేల వరకు కాజేస్తున్నారని మహిళా ఉద్యోగి జెస్సీ ఆరోపించింది.

తమకు వచ్చే చాలీచాలని జీతంలో నుంచి డబ్బులు తీసుకుంటే తాము ఎలా బతకాలంటూ వాపోయింది. ఇదేంటని నిలదీస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కోరింది.

ఇదీ చదవండి:రామాంతపూర్​లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details