తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 2:14 PM IST

ETV Bharat / state

హరీష్​రావు బర్త్​డే కానుకగా.. సరుకులు పంపిణీ

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్​ రావు 48వ జన్మదినం సందర్భంగా ఆయన అభిమాని పేదలకు నిత్యావసర సరుకులు పంచారు. అనంతరం 48 కేజీల కేకు చేసి.. అందరికీ పంచారు.

Fan Distributes Groceries On Occasion Of Harish Rao Birth Day
హరీష్​రావు బర్త్​డే కానుకగా.. సరుకులు పంపిణీ

కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలోని సూరారం భీమా గార్డెన్​లో రాష్ట్ర మంత్రి హరీష్​ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమాని, కుత్బుల్లాపూర్​ తెరాస యువ నాయకుడు సంతోష్​ రెడ్డి మంత్రి హరీష్​ రావు పుట్టినరోజు సందర్భంగా 1600 మందికి నిత్యావసరాలు పంచారు. అనంతరం 48 కేజీల కేకు కట్​ చేశారు. మంత్రి 48వ పుట్టినరోజు సందర్భంగా 48 క్వింటాళ్ల బియ్యం, 48 క్వింటాళ్ల కూరగాయలు, 48 క్వింటాళ్ల పండ్లను పేదలకు పంచి పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details