మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శాపూర్‌నగర్‌లో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ తాను ఇంట్లో నిరసన చేస్తుండగా తనను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అరెస్ట్ - మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అరెస్ట్
శ్రీశైలం గౌడ్ అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కృషితో ప్రగతిపథంలో రాష్ట్రం: గవర్నర్