తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు 'ప్రతి ఆదివారం ఉదయము 10: 00 గంటలకు పది నిమిషాలు మీకోసం' కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లిలోని తన స్వగృహ ఆవరణలో శుభ్ర పరిచారు.
ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటించాలి: మంత్రి మల్లారెడ్డి - medchal updates
'ఆదివారం ఉదయం 10:00 గంటలకు పది నిమిషాలు మీకోసం' కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి తన ఇంటి ఆవరణను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటించాలి: మంత్రి మల్లారెడ్డి
డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణమవుతున్న దోమల నివారణకు ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయాలని మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. పగిలిన కుండలు, డబ్బాలు, డ్రమ్ములు మొదలగు వాటిలో నీరు నిలిచి ఉంటే తొలగించాలన్నారు. ప్రజలందరూ ఇళ్లకు పరిమితమై కరోన మహమ్మారిని అరికట్టేందుకు సహకరించాలని కోరారు
ఇదీ చూడండీ :ఎనభై ఏళ్ల వయసులో యోగాతో అదరగొడుతున్న బామ్మ