etela rajender on kcr: ప్రజలు నిర్ణయిస్తేనే ప్రజాప్రతినిధులు అవతారని.. పార్టీలు నిర్ణయిస్తే కారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ధర్మాన్ని గెలిపించారని అన్నారు. హుజూరాబాద్ ఫలితం 2023లో జరగనున్న ఎన్నికల్లో పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని.. బానిస సంకెళ్లు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, వాటికి రిజర్వేషన్లు పెంచడం కాదు.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
మీ దిల్లీకే మెరుక పరిపాలించే సత్తా..! నాకుంటాది.. ఈ రాష్ట్రం మీద, ప్రజల మీద.. నాకున్న మమకారం దిల్లీ సర్కారుకు ఉండదని చెప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ ఇవాళ మాత్రం అదే దిల్లీ సర్కారు వడ్లు కొనాలని ధర్నా చేస్తున్నాడు. హుజూరాబాద్ ప్రజల పుణ్యమా అని ప్రగతి భవన్, ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చి.. ఏ ధర్నాలు చేయకూడదని హుకుం జారీ చేశాడో అదే అడ్డమీద ముఖ్యమంత్రి హోదాలో మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ధర్నా చేయడం.. తెలంగాణ ప్రజలు సాధించిన గొప్ప విజయం. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా... ఇప్పటికైనా భూమిమీద నడిచే ప్రయత్నం చెయ్యి. నేనడుగుతున్నా.. ఏనాడైనా సహచర మంత్రులను వారి డిపార్ట్మెంట్లమీద స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏర్పడిందా..? ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన అధికారులు ఉంటే ఏనాడు చూడాలేదు ముఖ్యమంత్రిగారు.. అంతా నేనే.. అనుకునేవారు. నేను చేస్తే ఒక లీడరు అవుతారు.. నేను తీస్తే ఖతం అయిపోతారనే కాన్సెప్ట్‌తో ఉన్న వ్యక్తి కేసీఆర్..