మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణులు, దివ్యాంగులు, కూలీలకు మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొని దాదాపు 1000 మందికి సరుకులను అందజేశారు.
మల్కాజిగిరిలో నిత్యావసరాలు పంచిన మైనంపల్లి ట్రస్ట్
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని బ్రాహ్మణులు, దివ్యాంగులు, కూలీలకు... మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొని సరుకులను అందజేశారు.
నిత్యావసరాలు పంపిణీ
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతోనే నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆకలితో ఉన్నవారు తమ సంస్థకు సమాచారమిస్తే సభ్యులు వారికి ఆహారం అందిస్తారని చెప్పారు. మైనంపల్లి ట్రస్ట్ సేవలను తెరాస దిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి అభినందించారు.