తెలంగాణ

telangana

ETV Bharat / state

8 ఏళ్ల బాలుడిపై 15 కుక్కల దాడి, పరిస్థితి విషమం - dogs

కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు 15 గ్రామసింహాలు మూకుమ్మడిగా బాలుడిపై దాడి చేశాయి. మల్కాజిగిరి జిల్లా మౌలాలీ ప్రాంతంలో ఈ జరిగిన ఘటనతో స్థానికులు భయాందోనలకు గురవుతున్నారు.

8 ఏళ్ల బాలుడిపై 15 కుక్కల దాడి

By

Published : May 28, 2019, 11:41 AM IST

Updated : May 28, 2019, 2:18 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలీలో దారుణం జరిగింది. వీధికుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన బాలుడిపై ఒక్కసారిగా 15 గ్రామసింహాలు చుట్టుముట్టి మూకుమ్మడి దాడి చేశాయి. తలపై, ఒళ్లంతా కరిచాయి. కుక్కలను చెదరగొట్టిన స్థానికులు హుటాహుటిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ఎన్నిసార్లు జీహెచ్​ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

8 ఏళ్ల బాలుడిపై 15 కుక్కల దాడి, పరిస్థితి విషమం
Last Updated : May 28, 2019, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details