తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారంలో పోలీసులు కీలక పాత్ర పోషించాలి: డీజీపీ - మంత్రి మల్లారెడ్డి తాజా వార్తలు

మేడ్చల్​ జిల్లా పర్వతాపూర్​లో నిర్మిస్తున్న రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ నిర్మాణ స్థలంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి పోలీసులు మొక్కలు నాటారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పోలీసు శాఖ భాగస్వామ్యం అవుతున్నట్లు డీజీపీ మహేందర్​ రెడ్డి తెలిపారు. రాచకొండ కమిషనరేట్ భవన నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్​లో ఎకరానికి 1000 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆరో విడత హరితహారంలో పోలీసు శాఖ భాగస్వామ్యం ఉంటుంది: డీజీపీ
ఆరో విడత హరితహారంలో పోలీసు శాఖ భాగస్వామ్యం ఉంటుంది: డీజీపీ

By

Published : Jun 25, 2020, 3:54 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పోలీసు శాఖ భాగస్వామ్యం అవుతున్నట్లు డీజీపీ మహేందర్​ రెడ్డి వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్​లో సుమారు 56 ఎకరాలలో నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణ స్థలంలో మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, సీపీ మహేశ్​ భగవత్​తో కలిసి మొక్కలు నాటారు.

మొక్కలు నాటుతున్న పోలీసులు

పోలీస్ స్టేషన్ ఆవరణతో పాటు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని డీజీపీ.. పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. కమిషనరేట్ భవన నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరిత హారంలో ప్రజా ప్రతినిధులు, పోలీస్ స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల వారు చురుగ్గా పాల్గొనాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. రాచకొండ కమిషనరేట్ భవన నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్​లో ఎకరానికి 1000 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి:హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details