మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఒమేగా డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న హరిత(19) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్ష తప్పానని మనస్తాపం చెందిన హరిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య - VIDYARTHI
పరీక్ష తప్పిందనే కారణంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది.
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య