కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ మేడ్చల్ జిల్లాలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా టీకా వేసుకుని, మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్‌పై ఎలాంటి అపోహలు నమ్మకూడదని చెప్పారు.
కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మొద్దు : మంత్రి మల్లారెడ్డి
కొవిడ్ టీకా విషయంలో ప్రజలు అనుమానపడొద్దని, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. మేడ్చల్ జిల్లా బోయిన్పల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్‌ను ప్రారంభించారు.
బోయిన్‌పల్లిలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్
మేడ్చల్ జిల్లా బోయిన్పల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్‌ను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయిన్పల్లి, పికెట్, తిరుమలగిరి ప్రాంతాల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటగా వైద్యులు, వైద్య సిబ్బంది, కరోనా వారియర్స్‌కు ఇచ్చిన తర్వాత వృద్ధులకు దశల వారీగా టీకాలు వేస్తామని మంత్రి వెల్లడించారు.