మేడ్చల్ జిల్లా కొత్తపేటలోని మెడిసిటీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న వార్తతో చుట్టుపక్కల ప్రాంతంలో కలకలం రేగింది. అతను ఘన్పూర్లోని తన స్నేహితుడి వద్దకు వెళ్లాడు. కాగా ఆ సమయంలో అతడికి శ్వాస సంబంధమైన సమస్య తలెత్తింది. దాన్ని గమనించిన బాధితుడి స్నేహితుడు వెంటనే ఆసుపత్రికి సమాచారం అందించాడు. గాంధీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక సిబ్బంది వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఘన్పూర్లో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి.. స్థానికుల్లో ఆందోళన - వ్యక్తికి కరోనా లక్షణాలు
మేడ్చల్ జిల్లా ఘన్పూర్లోని ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడం వల్ల స్థానికులు భయాందోళనలు గురయ్యారు. వెంటనే 108 కాల్చేయగా ప్రత్యేక సిబ్బంది వచ్చి అతన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఘన్పూర్లో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి.. స్థానికుల్లో ఆందోళన
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మెడిసిటీ ఆసుపత్రికి చేరుకుని దానిని మూసి వేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. అతని స్నేహితుడు, మరి కొంత మంది అక్కడ పనిచేసే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దానితో వారందరినీ వైద్య పరీక్షల నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:ఎలాంటి రెడ్ జోన్లు లేవు.. వదంతులు నమ్మొద్దు: ఈటల