తెలంగాణ

telangana

ETV Bharat / state

కుత్బుల్లాపూర్​ ప్రాంతీయ వాసులకు కరోనా పరీక్షలు

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​ ప్రాంతంలోని ఓ వ్యక్తికి కరోనా సోకిందన్న సమాచారంతో మండల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతం 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి ఒక్కరిని 24 మంది వైద్య సిబ్బంది పరీక్షిస్తున్నారు. అయితే కొవిడ్​-19 సోకిన వ్యక్తితో పాటు మరో 40 మంది దిల్లీ సందర్శించినట్లు స్థానికులు తెలిపారు.

కుత్బుల్లాపూర్​ ప్రాంతీయ వాసులకు కరోనా పరీక్షలు
కుత్బుల్లాపూర్​ ప్రాంతీయ వాసులకు కరోనా పరీక్షలు

By

Published : Mar 27, 2020, 5:05 PM IST

కుత్బుల్లాపూర్​ ప్రాంతీయ వాసులకు కరోనా పరీక్షలు

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని ఓ వ్యక్తికి (49) కరోనా సోకిందని గురువారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం వల్ల మండల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతం మూడు కిలో మీటర్ల పరిధిలోని ప్రతి ఇంట్లో ఉండే వ్యక్తిని పరీక్షిస్తున్నారు. ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబు, దమ్ము లక్షణాలతో బాధపడుతున్నారా అని ఇంటింటికి వెళ్లి తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు 3000 మందిని పరీక్షించినట్లు మండల వైద్యాధికారి నిర్మల తెలిపారు.

కరోనా సోకిన వ్యక్తితో పాటు 40 మంది దిల్లీలో సందర్శన:

అయితే కరోనా సోకిన వ్యక్తి తో పాటు మరో రెండు కాలనీలకు చెందిన 40 మంది దిల్లీ వెళ్లారు. వీరంతా ఓ మసీదుకు వెళ్లినట్లు తెలిసింది. కరోనా సోకిన వ్యక్తితో పాటు మరో 40 మంది దిల్లీలో ఇష్టానుసారంగా తిరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇందులో 19 మంది పది రోజుల కిందట, మరో నలుగురు వారం కిందట హైదరాబాద్​ వచ్చారు. మరికొందరు అక్కడే ఉన్నట్లు సమాచారం. వారం కింద వచ్చిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం, దగ్గు రావడం వల్ల కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాంధీ ఆసుపత్రికి తరలించడం వల్ల అతడికి కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు.

ఎక్కడెక్కడా తిరిగారో ఆరా..

కొవిడ్​-19 సోకిన వ్యక్తి, మిగతా 40 మంది దిల్లీలో ఎక్కడెక్కడ తిరిగారన్న విషయం తెలియాల్సి ఉంది. వీరంతా వచ్చిన రైలు బోగి గుర్తించి దానిలో ప్రయాణించిన వ్యక్తులకు పరీక్షించాల్సిఉందని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తికి ముందుగా చికిత్స చేసిన వైద్యుడిని కూడా హోమ్ క్వారంటైన్​లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరు వెళ్లిన మసీదు పెద్దలతో మాట్లాడి వారికి తగు సూచనలు చేసినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కరోనా సోకిన వ్యక్తి కుటుంబసభ్యులు నలుగురిని గాంధీకి తరలించామని.. వారి రిపోర్టులు రావాల్సి ఉందని మండల వైద్యాధికారి నిర్మల వెల్లడించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందలేదు: ఈటల

ABOUT THE AUTHOR

...view details