- బండ్లగూడజాగీర్ కార్పొరేషన్‌లోని పీరంచెరువులోకి పోలీస్ అకాడమీ, స్నేహిత హిల్స్, పీరంచెర్వు ప్రాంతాలు, ఓ కళాశాల మురుగు నేరుగా కలుస్తోంది. హెచ్‌ఎండీఏ నిర్మించిన ఎస్టీపీ పనిచేయడంలేదు.
- నిజాంపేట కార్పొరేషన్‌లోని బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌లోని మేడికుంట చెరువులోకి సమీప కాలనీల మురుగంతా కలుస్తోంది. దుర్వాసన వెదజల్లుతోంది.
- శంషాబాద్ కాముని చెరువులోకి వ్యర్థ జలాలు కలుస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫేజ్-1 కింద రూ.8లక్షలతో కట్ట వెడల్పు చేశారు. హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ తరఫున రూ.40లక్షలను అభివృద్ధికి వినియోగించారు. అయినా చెరువు బాగుపడలేదు.
చిత్త‘శుద్ధి’ కరవు
కాలనీలు, జనావాసాల నుంచి వచ్చే మురుగునీటిని చెరువులో నేరుగా కలిపేందుకు వీల్లేదు. చెరువు లేదా బహిరంగ ప్రదేశంలో మురుగునీటి శుద్ధి ప్లాంటు(ఎస్‌టీపీ) నిర్మించి నీటిని శుద్ధి చేయాలి. నీటిని శుద్ధి చేసి స్వచ్ఛంగా మారిన తర్వాతే చెరువులోకి విడిచిపెట్టాలి. మున్సిపల్ అధికారులు నిబంధనలు పాటించడం లేదు. నార్సింగిలోని కోకాపేట చెరువుకు ఎస్టీపీ మంజూరైనా నిర్మించలేదు. ఇబ్రహీంపట్నం చిన్న చెరువు చెత్త డంపింగ్ యార్డుగా మారింది.