తెలంగాణ

telangana

ETV Bharat / state

suicide attempt: కానిస్టేబుల్ సాహసం.. తల్లి, కుమారుడు సేఫ్ - తెలంగాణ వార్తలు

రెండేళ్ల చిన్నారితో సహా ఆత్మహత్యకు(suicide) యత్నించిన ఓ మహిళను కానిస్టేబుల్ కాపాడారు. మేడ్చల్ జిల్లాలోని కొంపల్లికి చెందిన మహిళ ఓ క్వారీలో దూకడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.

constable rescue, constable help to woman
కానిస్టేబుల్ సాహసం, మహిళను కాపాడిన కానిస్టేబుల్

By

Published : May 30, 2021, 1:35 PM IST

ఓ కానిస్టేబుల్ సాహసంతో తల్లీ, కుమారుడు క్షేమంగా ఉన్నారు. కుమారుడితో సహా ఆత్మహత్యకు(suicide) యత్నించిన ఓ మహిళను కానిస్టేబుల్ కుద్దూస్ కాపాడారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లి నివాసముండే రాధ, భర్తతో గొడవపడినట్లుగా స్థానికులు తెలిపారు. మనస్తాపానికి గురై ఆమె రెండేళ్ల చిన్నారిని తీసుకొని జయభేరి కాలనీలోని క్వారీలో దూకడానికి ప్రయత్నించగా కానిస్టేబుల్ గమనించారు.

వెంటనే అక్కడికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పి... వారిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లి, కుమారుడిని కాపాడిన కానిస్టేబుల్ కుద్దూస్​ని ఉన్నతాధికారులు అభినందించారు.

ఇదీ చదవండి:అమానుషం: కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details