తెలంగాణ

telangana

ETV Bharat / state

శివార్లపై కన్నేసిన కాంగ్రెస్.. ఆ రెండు ఖాయమేనా? - 2019 elections

అసెంబ్లీ ఎన్నికల్లో అస్తవ్యస్థమైన హస్తం పార్టీ... కనీసం లోక్‌సభ పోరులోనైనా పరువు కాపాడుకోవాలనే పట్టుదలతో పోరాడుతోంది. 17సీట్లలో 10 పార్లమెంటు స్థానాలపై అధిష్ఠానం దృష్టి సారించింది. అధినేత రాహుల్‌ ప్రచార సభలతో పాటు స్థానికంగా ఎక్కడికక్కడే వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని రెండు ఎంపీలు గెలిచితీరాలన్న లక్ష్యంతో హస్తం అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న రెండు స్థానాలు

By

Published : Apr 7, 2019, 6:05 PM IST

శాసనసభ ఎన్నికల్లో బోల్తా కొట్టిన కాంగ్రెస్... గౌరవప్రదమైన పార్లమెంట్​ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పోరాడుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డిలో కాంగ్రెస్ బలంగా ఉన్న మల్కాజిగిరి, చేవెళ్లపై ఆశలు పెట్టుకుంది. అభ్యర్థులు, రాజకీయ పరిస్థితులను పరిగణించి ఓటేస్తారని చెబుతున్నారు. దాదాపు 31లక్షల ఓటర్లు ఉన్న మల్కాజిగిరిలో... మూడో వంతుకుపైగా ఉండే తటస్థ ఓటర్లే తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి అభ్యర్థి రేవంత్‌రెడ్డి... వాగ్ధాటి, ప్రభుత్వంపై పోరాటం, సమస్యలపై స్పందిస్తారన్న నమ్మకం... జనాల్లో బలంగా ఉందని అంచనా వేస్తున్నారు.

నగర శివారులోని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో... సగటున మహేశ్వరం, రాజేంద్రనగర్​లో 4లక్షల 50వేలు, శేరిలింగంపల్లిలో 6లక్షలకు పైగా ఓటర్లున్నారు. మిగతా స్థానాల్లో 2లక్షలకు పైగా ఓట్లు ఉంటాయి. శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో ఓటర్లు పార్టీలకు అతీతంగా ఓట్లేస్తారనే విశ్వాసంతో ఉన్నారు హస్తం నేతలు. ఇక్కడి ఓటర్లపై పార్టీల ప్రభావం కన్నా అభ్యర్థుల గుణగణాలనే చూస్తారని అంచనా వేస్తున్నారు. జయాపజయాలను శివారు ఓటర్లే నిర్ణయించనున్నందున ఈ రెండు స్థానాలపై కాంగ్రెస్​లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న రెండు స్థానాలు

ఇవీ చూడండి: హైదరాబాద్​లో మజ్లిస్​ను ఢీకొట్టేదెవరు ?

ABOUT THE AUTHOR

...view details