కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుభాష్‌నగర్ డివిజన్లో ఇళ్ల పట్టాలు, పింఛన్లు, మహిళలకు రుణాలు ఇప్పించేందుకు కృషిచేస్తానని తెదేపా అభ్యర్థి మద్దూరి సాయితులసి హామీ ఇచ్చారు. డివిజన్లో మౌలిక వసతుల కల్పన కోసమే తాను పోటీచేస్తున్నట్లు తెలిపారు.
మౌలిక వసతుల కల్పన కోసమే పోటీచేస్తున్నా: మద్దూరి సాయితులసి - సుభాష్‌నగర్ తెదేపా అభ్యర్థి మద్దూరి సాయితులసి
సుభాష్‌నగర్‌లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. తెదేపా అభ్యర్థి మద్దూరి సాయితులసి తెలిపారు. ఇళ్ల పట్టాలు, పింఛన్లు, మహిళలకు రుణాలు ఇప్పంచడం సహా మౌలిక సమస్యల కల్పనకు కృషిచేస్తానన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.
మౌలిక వసతుల కల్పన కోసమే పోటీచేస్తున్నా: మద్దూరి సాయితులసి
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అధిక కాలుష్యంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని.. గెలిపిస్తే వారి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థులకు డివిజన్లోని సమస్యల పట్ల కనీస అవగాహన లేదని విమర్శించారు.
ఇవీచూడండి:బడ్జెట్ బెత్తెడు... భారం బండెడు