మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఉప్పల్లోని బండ్లగూడలో ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లు సందర్శించారు. వరద నీటిలో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించారు. బోటులో వరద నీటిలో ప్రయాణిస్తూ... స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అయ్యప్ప కాలనీలో వరద బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున అందిస్తున్న రేషన్ కిట్లను వారికి అందించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ వాసం - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
మేడ్చల్ బండ్లగూడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. అంటువ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ వాసం
అంటు వ్యాధులు రాకుండా కాలనీవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
ఇదీ చూడండి.. మా కొడుకు శవాన్నైనా చూపించండి.. జవాన్ తల్లిదండ్రుల వేడుకోలు