మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో సీఐటీయూ 3వ రాష్ట్ర మహాసభను నిర్వహించారు. పనిచేసే కార్మికులకు కనీస వేతనం కల్పించాలని, లేదంటే అడిగే హక్కు కార్మికులకు ఉందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత అన్నారు. ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం 21వేలు ఉండాలని... కానీ ఐదు వేలు కూడా లేని పరిస్థితి భారతదేశంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మిక చట్టాల సవరణకు పూనుకుందన్నారు. కనీస వేతన చట్ట సవరణ వల్ల భారతదేశంలో కార్మికులకు ఇప్పుడున్న హక్కులు కూడా లేకుండా పోతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో భారత దేశ కార్మికులు మరిన్ని పోరాటాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
'కార్మిక హక్కుల సాధనకు ఉద్యమిద్దాం' - citu meeeting
కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో సీఐటీయూ 3వ రాష్ట్ర మహాసభను నిర్వహించారు.
కుషాయిగూడలో సీఐటీయూ 3వ రాష్ట్ర మహాసభ