తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువులో చిక్కుకున్న చిన్నారులు... ఎలా బయటకు వచ్చారంటే?! - బొబాఖాన్ చెరువులో చిక్కుకున్న చిన్నారులు

Childrens trapped in pond: మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలోని బొబాఖాన్ చెరువు మధ్యలో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చిక్కుకున్నారు. స్థానికులు గమనించి మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పారిశుద్ధ్య సిబ్బంది చెరువులోకి దిగి బాలురులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. క్షణాల్లో స్పందించి చిన్నారుల ప్రాణాలను కాపాడిన మున్సిపల్ సిబ్బందిని పలువురు అభినందించారు.

Childrens trapped in pond
Childrens trapped in pond

By

Published : Dec 17, 2021, 12:38 PM IST

Childrens trapped in pond: చెరువులో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను పారిశుద్ధ్య సిబ్బంది రక్షించిన ఘటన మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలో జరిగింది. షాపూర్ నగర్​కు చెందిన నరేశ్​, పవన్​ బాబు, అనికేత్ ముగ్గురు స్నేహితులు. వీరు షాపూర్ నగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నారు. వీరి తల్లిదండ్రులు దినసరి కూలీలు. వీరు ముగ్గురు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వాహనదారులను లిఫ్ట్​ అడిగి బహదూర్ పల్లి చేరుకున్నారు. ముందుగా హనుమాన్ ఆలయం వద్ద కొంతసేపు గడిపారు.

చిన్నారులను కాపాడిన పారిశుద్ధ్య సిబ్బంది...

అనంతరం పక్కనే ఉన్న బొబాఖాన్ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఒడ్డున ఉన్న నాటు పడవలో కూర్చుని చెరువు మధ్యలోకి వెళ్లారు. తీరా బయటకు వచ్చేందుకు వీలు కాకపోవడంతో కేకలు వేస్తుండగా అటుగా వెళ్తున్న స్థానికుడు శ్రీకాంత్... చిన్నారుల అరుపులను విని దుండిగల్ మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లి చెరువులోకి దిగి బాలురులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. వారిని విచారించగా చేపలు పట్టేందుకు చెరువులోకి దిగినట్లు పిల్లలు తెలిపారు. వారి వివరాలను తెలుసుకుని షాపూర్ నగర్​లో ఉంటున్న తల్లిదండ్రులకు అప్పగించారు. క్షణాల్లో స్పందించి చిన్నారుల ప్రాణాలను కాపాడిన మున్సిపల్ సిబ్బంది బాబు, శ్రీకాంత్​ను పలువురు అభినందించారు.

ఇదీ చదవండి:Inter Student Suicide : తక్కువ మార్కులొచ్చాయని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details