రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఒక్క పథకం కూడా తెరాస సర్కారు చేపట్టలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రులు, భాజపా శ్రేణులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు.
కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్ రెడ్డి
నిరుద్యోగ యువత, ఉద్యోగులు కేసీఆర్ సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఒక్క పథకం కూడా తెరాస సర్కారు చేపట్టలేదని ఆయన ఆరోపించారు.
కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్ రెడ్డి
నిరుద్యోగ యువత, ఉద్యోగులు కేసీఆర్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పట్టభద్రులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి, భాజపా శ్రేణులు, పట్టభద్రులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎవరు ఎవర్ని ఆదుకుంటున్నారో అర్థమవుతోంది: కేటీఆర్