తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2020, 10:35 AM IST

ETV Bharat / state

ఇదేం వైద్యం: గొలుసులతో కట్టేసి... చిత్రహింసలు పెడుతున్నారు!

పేరుకి అది ఓల్డ్​ఏజ్​ హోమ్​... అక్కడ ఉండేది వృద్ధులు మాత్రమే కాదు. మానసిక రోగులు, మద్యం, గంజాయికి బానిసలు అయిన వారందరు ఉంటారక్కడ. మద్యానికి బానిసైన వారిని ఆసుపత్రుల్లో చికిత్స చేయించకుండా వారి తల్లిదండ్రులు నిర్వాహకులకు డబ్బులిచ్చి ఓల్డ్​ఏజ్​హోమ్​లో చేరుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కేంద్రాన్ని నడుపుతున్న మమత ఓల్డ్​ఏజ్​హోమ్​ నిర్వాహకులపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు.

Case filed against Mamata Old Age Home in Nagaram, Medchal District
మమత వృద్ధాశ్రమంపై కేసు నమోదు

మేడ్చల్​ జిల్లా కీసర మండలం నాగారం శిల్పనగర్​లో మమత ఓల్డ్​ఏజ్​హోమ్​ మొదట ఇండిపెండెంట్​ బిల్డింగ్​లో ప్రారంభించారు. ఆ తర్వాత డబ్బులు తీసుకుని మానసిక రోగులను చేర్పించుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా మద్యానికి బానిసైన వారు... ఇలా అందరినీ ఒకే దగ్గర ఉంచారు.

గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు

మానసిక వికలాంగులను గొలుసులతో బంధించి, కర్రలతో కొడుతున్నట్లు చుట్టుపక్కల వాళ్లు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని బాధితులు పోలీసుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. ఒక్కో మానసిక వికలాంగుడికి 5వేల నుంచి 10వేల రూపాయలను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.

సోషల్​ మీడియాలో వైరల్

మానసిక రోగుల అరుపులు, మహిళలకు గొలుసులు వేసిన దృశ్యాలు సామాజిక మాద్యమంలో వైరల్​ కావడం వల్ల స్పందించిన కలెక్టర్​ ఎంవి రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.

రెండు గదుల్లో 73 మంది

రెండు గదుల్లో 73 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మమత ఓల్డ్​ ఏజ్​హోమ్​ సందర్శించిన మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అక్కడి మానసిక రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతో వృద్ధులను కాకుండా మానసిక రోగులను, మద్యం తాగేవారిని, గంజాయి తీసుకునే వారిని చేర్చుకొని... అందరినీ ఒకే దగ్గర ఉంచడం సరికాదని ఆమె నిర్వాహకులను హెచ్చరించారు. నిర్వాహకులు జాన్ రతన్ పాల్, కె భారతితో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్న వృద్ధులను వేరే హోల్డ్ ఏజ్ హోమ్​కి, మానసిక రోగులకు రిహాబిలిటేషన్ సెంటర్​కు తరలించారు.

మమత వృద్ధాశ్రమంపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details