ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి వెంటనే పేద ప్రజలకు రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండల కార్యాలయం ఎదుట భాజపా నాయకులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన రెండు పడక గదుల ఇళ్ల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ భాజపా కార్యకర్తల నిరసన - telangana lrs scheme lastest news
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండల కార్యాలయం ఎదుట భాజపా నాయకులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి.. పేద ప్రజలకు వెంటనే రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ భాజపా కార్యకర్తల నిరసన
రెండు పడక గదుల ఇళ్ల సమస్య తెరపైకి వస్తుందనే భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకే తెరాస ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను తీసుకువచ్చిందని భాజపా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని విక్రమ్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!