పాత కక్షలే రౌడీషీటర్ మైకేల్ హత్యకు కారణమని బాల నగర్ డీసీపీ పద్మజా అన్నారు. మైకేల్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రెండు కర్రలు, సిమెంట్ కడ్డీ, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోతుకుంటలో నివాసముంటున్న మైకేల్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు.
పాత కక్షలే కారణం
కొన్నిరోజుల క్రితం స్థానిక పాన్ షాప్‌కు చెందిన మనీశ్‌తో మైకేల్, అతని తమ్ముడు విన్సెంట్ గొడవకు దిగారు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారు. గత నెల 26వ తేదీన తిరిగొచ్చాడు. మైకేల్... మనీశ్, విశాల్ ఇళ్లకు వెళ్లి బెదిరించాడు. ఆందోళన చెందిన వీరు అతనితో ఏప్పటికైనా అపాయమని భావించి చంపేందుకు ప్రణాళిక రచించారు.