హైదరాబాద్ శివారు ప్రాంతం ఘట్‌కేసర్ పొలీసు స్టేషన్ పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న వైద్యులు అరుణ కుమారి, శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి క్లినిక్ వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని రూ.4లక్షల నగదు, 50 గ్రాముల బంగారు నగలను పోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నగర శివారులో చోరీ - అపహరణ
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపొతున్నారు. ఓ ఇంట్లో రూ.4లక్షల నగదు, 50 గ్రాముల బంగారు నగలు దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగర శివారులో చోరీ