తెలంగాణ

telangana

ETV Bharat / state

'జూన్‌ 2 తర్వాత రెండు వేల పింఛను' - devender reddy

మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్, జక్కన్నపేట్ మండలాల్లోని పలు గ్రామాల్లో మెదక్‌  ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

'జూన్‌ 2 తర్వాత రెండు వేల పింఛను'

By

Published : May 4, 2019, 4:48 PM IST

మెదక్‌ జిల్లా ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి పలు మండలాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస నుంచి పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ నాలుగున్నర సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. జూన్ 2 తర్వాత అర్హులైన పింఛనుదారులందరికి రెండు వేలకు పింఛను పెంచుతున్నట్లు తెలిపారు.\

ఆరో తేదిన జరగనున్న ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను తెరాస బలపరిచిన అభ్యర్థి సుజాత శ్రీనివాస్ రెడ్డిని, జక్కన్నపేట్ ఎంపీటీసీ అభ్యర్థి మెగావత్ కృష్ణవేణిని గెలిపించాలని ఓటర్లకు పద్మా దేవేందర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details