మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని బీ ఫారాల పంపిణీలో తెరాస నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జడ్పీ అధ్యక్షురాలు హేమలత క్యాంపు కార్యాలయంలో ఆశావహ నాయకులు అధ్యక్షురాలు కొట్లాటకు దిగారు.
సీఎం నియోజకవర్గంలో బీ ఫారాల కోసం తెరాస నాయకుల గొడవలు - మెదక్ జిల్లా తాజా వార్త
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో బీ ఫారాల పంపిణీ విషయంలో నాయకుల మధ్య గొడవలు జరిగాయి. టికెట్ల కోసం తెరాస నాయకులు జిల్లా అధ్యక్షురాలి ఎదుటే పరుష పదజాలంతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
సీఎం నియోజకవర్గంలో బీ ఫారాల కోసం తెరాస నాయకుల గొడవలు
ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని మండలం కావడం వల్ల టికెట్ల పంపిణీలో నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొంతమంది తమకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఒకరిపై ఒకరు తీవ్ర పరుష పదజాలంతో గొడవ పెట్టుకున్నారు.
ఇదీ చదవండి:విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్