'పిల్లల్ని ఆ వాహనాల్లో పంపాలంటే భయంగా ఉంది'
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటారు. కానీ పాఠశాలకు వెళ్దామంటే సమయానికి ఓ బస్సు ఉండదు. స్కూల్కు ఆలస్యం అవుతుందేమోనని ప్రైవేటు వాహనాల్లో పంపిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆ వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదని, క్షేమంగా వెళ్తారో లేరోనని ప్రతిక్షణం ఆందోళన చెందుతున్నారు.
'పిల్లల్ని ఆ వాహనాల్లో పంపాలంటే భయంగా ఉంది'
మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో మోడల్ స్కూల్ ఉంది. జక్కపల్లి గ్రామం నుంచి ఆ పాఠశాలకు వెళ్లేందుకు రోజు ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్క బస్సే వస్తోంది. ఒక్కోసారి అది కూడా ఉండట్లేదు. దీనివల్ల విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం అంటేనే చిన్నారుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. తమ సమస్యను త్వరగా పరిశీలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.