కరోనా పరీక్షలు పెంచాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంజనేయులు గౌడ్ కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తక్కువగా చేస్తున్నారని ఆరోపించారు. కొంచెం ఆలస్యమైనా పరీక్షలు చేయకుండా అనుమానితులను తిప్పిపంపండం సరికాదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి... ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా పరీక్షలు పెంచాలి: టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి - తెలంగాణ వార్తలు
కొవిడ్ పరీక్షలను పెంచాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
కరోనా పరీక్షలు తాజా వార్తలు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్
రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యంపై... రెడ్డిపల్లి పీహెచ్సీ ముందు నిరసన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియదర్శినిని కొవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్యంపై వివరణ కోరారు. పీపీఈ కిట్లు తీసిన తర్వాత వచ్చి పరీక్షలు చేయాలని కొందరు కోరుతున్నారని ఆమె తెలిపారు. అలా చేయడం సాధ్యం కాదన్నారు. సకాలంలో ఆరోగ్య కేంద్రానికి వస్తే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి:నేటి నుంచే '18 ప్లస్'కు టీకా.. కొన్ని రాష్ట్రాల్లోనే!