తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్కసారిగా చేతిలో నుంచి జారిపోయాడు: బాలుడి తండ్రి - మెదక్​ జిల్లా తాజా వార్తలు

ఒక్కసారిగా చేతిలో నుంచి సాయివర్ధన్ జారి పోయాడని బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడి తండ్రి భిక్షపతి తెలిపాడు. మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్​పల్లిలో బోరుబావిలో పడిపోయిన బాలుడిని వెలికితీసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఇప్పటికే మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఒక్కసారిగా చేతిలో నుంచి జారిపోయాడు: బాలుడి తండ్రి
ఒక్కసారిగా చేతిలో నుంచి జారిపోయాడు: బాలుడి తండ్రి

By

Published : May 27, 2020, 9:45 PM IST

"మా బంధువుల పొలంలో బోరు వేశాం. ఇప్పటికే మూడు బోర్లు వేశాం. మొత్తం మూడు బోర్లలో ఇసుకనే వచ్చింది. నా కొడుకు నాతోనే ఉన్నాడు. తిరిగిపోదామనుకున్నాం. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దుమ్ముకు కాలు జారిపోయి బోరు బావిలో పడ్డాడు. మాకు తెలీకుండానే చేతిలో నుంచి జారిపోయాడు. ఏదో ఉయ్యాల నుంచి జారినట్టు జారాడు."

-భిక్షపతి, బాలుడి తండ్రి

ఒక్కసారిగా చేతిలో నుంచి జారిపోయాడు: బాలుడి తండ్రి

ఇదీ చదవండి: మెదక్‌ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

ABOUT THE AUTHOR

...view details