ఉమ్మడి మెదక్ జిల్లాను మూడు జాతీయ అవార్డులు వరించాయి. పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ పురస్కారాలు ప్రకటించింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తికరణ్ పురస్కారాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్‌తో పాటు సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి, మల్యాల గ్రామాలకు చోటు దక్కింది.
ఉమ్మడి మెదక్ జిల్లాకు మూడు జాతీయ పురస్కారాలు
ఉమ్మడి మెదక్ జిల్లాను మూడు జాతీయ పురస్కారాలు వరించాయి. ఏప్రిల్ 24న ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. పురస్కారం గెలుచుకున్న గ్రామ పంచాయతీలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అభినందించారు.
జాతీయ పురస్కారాలు, మెదక్ జిల్లా
జనరల్ కేటగిరిలో జిల్లా పరిషత్‌కు, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణలో మిట్టపల్లి, మల్యాల గ్రామాలకు అవార్డులు వచ్చాయి. ఏప్రిల్ 24వ తేదిన ఈ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. అవార్డు గెలుచుకున్న గ్రామ పంచాయతీలను మంత్రి హరీశ్ రావు అభినందించారు. ప్రజలందరి సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. వీటిని ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాలు పురస్కారాలు పొందాలని సూచించారు.
- ఇదీ చదవండి :కవ్వింపుగా వలవేసి... వేధించి ఉసురు తీసి