మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్పల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించారు. శ్రావణమాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా పూజారులు అమ్మవారిని కమలలాతో అలంకరించారు. తెల్లవారుజామున 4 గంటలకు రాతి గుహలో కొలువుదీరిన అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు.
మొదటి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు
శ్రావణమాసం తొలి శుక్రవారం పురస్కరించుకుని ఆలయాలకు భక్తులు వెళ్తున్నారు. అమ్మవారని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దూరం పాటిస్తూ... మాస్కు తప్పని సరిగా ధరించాలని ఆలయ నిర్వాహకులు భక్తులకు సూచిస్తున్నారు.
మొదటి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ప్రధాన గేటు వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే భక్తులను ఆలయంలోనికి రానిస్తున్నారు. మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని... భక్తులకు ఆలయ ఈవో శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:కరోనా సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య