తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2020, 5:13 PM IST

ETV Bharat / state

మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

మెదక్ చర్చిలో ఆదివారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెుక్కులు తీర్చుకున్న భక్తులు పాస్టర్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ ఆధ్వర్యంలో భక్తులు ఆశీర్వచనాలు పొందారు.

మెదక్ చర్చిలో భక్తుల సందడి
మెదక్ చర్చిలో భక్తుల సందడి

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రెస్ బీటర్ ఇంఛార్జీ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చర్చి వెలుపల ఉన్న శిలువ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి కొవ్వొత్తులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత భక్తులకు మత గురువులు ఆశీర్వచనాలు అందించారు.

మెదక్ చర్చిలో భక్తుల సందడి

ABOUT THE AUTHOR

...view details