దేశంలో ఆర్థిక మాంద్యం రావడానికి గల కారణాలను, జీఎస్టీతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి ఈనెల 8న మెదక్ కలెక్టరేట్ మట్టడిస్తామని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంటరెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు. నోట్ల రద్దు వల్లనే దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవగాహనలేమితో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సన్నగిల్లిందని విమర్శించారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామోదర రాజనర్సింహ, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి గాలి అనిల్ కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు.
నవంబర్ 8న మెదక్ కలెక్టరేట్ ముట్టడి
ఏఐసీసీ ఆదేశాలపై డీసీసీ ఆధ్వర్యంలో నవంబర్ 8న మెదక్ కలెక్టరేట్ ముట్టడి, ధర్నాలు చేస్తున్నట్లు మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంట రెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు. దేశంలో ఆర్థిక మాంద్యం రావడానికి నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలే కారణమని పేర్కొన్నారు.
నవంబర్ 8న మెదక్ కలెక్టరేట్ ముట్టడి