మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా మారింది. కార్మికులు డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీ కృష్ణమూర్తి వాహనాన్ని అడ్డుకున్నారు. మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. కార్మికులను పోలీసులు అడ్డుకోవడం వల్ల పోలీసులకు కార్మికులకు స్వల్ప తోపులాట జరిగింది.
మెదక్లో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం - మెదక్లో ఆర్టీసీ సమ్మెలో తోపులాట
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ.. మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
మెదక్లో ఆర్టీసీ సమ్మె