తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్భిణీ మృతి... బంధువుల నిరసన ​ - తెలంగాణ నేర వార్తలు

మెదక్​ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణీ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద నిరసన తెలిపారు.

గర్భిణీ మృతి... బంధువుల నిరసన ​
గర్భిణీ మృతి... బంధువుల నిరసన ​

By

Published : Mar 3, 2021, 1:25 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్​ ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు సరైన వైద్యం చేయలేదని బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి చెందిందని ఆరోపించారు. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌ కష్యతండాకు చెందిన సునీతా(30) రెండురోజులు క్రితం రెండో ప్రసవం కోసం నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. మంగళవారం రాత్రి పదకొండుగంటల సమయంలో సునీత పరిస్థితి విషయంగా ఉందని.. వైద్యుల సూచనలతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నయం కాకపోవడం వల్ల గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

మృతదేహాన్ని నర్సాపూర్​ ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యుల నిర్లక్ష్యంతోనే సునీత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి పంపించారు.

ఇదీ చూడండి:కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details