తెలంగాణ

telangana

రామయపల్లి రైల్వే అండర్​ బ్రిడ్జ్ కింద భారీగా నిలిచిన వాననీరు​..

By

Published : Sep 27, 2020, 8:08 PM IST

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మెదక్​ జిల్లా రామయపల్లి రైల్వే అండర్​ బ్రిడ్జ్​ వద్ద నీరు నిలిచిపోయాయి. దానితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాన నీటిని తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

RAMAYAPALLY RAILWAY UNDER  BRIDGE BLOCK WITH RAINWATER IN MEDAK DISTRICT
రామయపల్లి రైల్వే అండర్​ బ్రిడ్జ్ కింద భారీగా నిలిచిన వాననీరు​..

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద రెండు రోజులుగా వాననీరు నిలిచిపోయాయి. 5 మోటర్ల సహాయంతో నీటిని ఎత్తి పోశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే రహదారిపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.జాతీయ రహదారి నుంచి వాహనాలను గ్రామాల మీదుగా ఉన్న చిన్న రహదారుల గుండా మళ్లించారు. బ్రిడ్జ్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్, జాతీయ రహదారుల పీడీ తరుణ్ పర్యవేక్షించారు.

ఇదీ చూడండి:రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details