రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేసింది. రాష్ట్రంలో బయట తిరిగే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సూచించింది. కరోనా రోజురోజుకు కోరలు చాస్తున్నవేళ... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన నిబంధనలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
మాస్క్ మరిచారో... వెయ్యి జరిమానా తప్పదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించిన ప్రజల్లో మార్పు రావడంలేదు. కరోనా రోజు రోజుకు కోరలు చాస్తున్న... కొవిడ్ నిబంధనలెవరూ పాటించడం లేదు. ఈ నేపథ్యంలో మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారికి పోలీసులు రూ.1000 జరిమానా విధిస్తున్నారు.
మాస్క్ మరిచారో... వెయ్యి జరిమానా తప్పదు
మాస్క్‌లేకుండా వచ్చే వాహనదారులకు రూ.1000 జరిమానా విధించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మాస్కులేకుండా వచ్చిన వారికి జరిమానాలు విధించారు. కనీసం ఇలా అయినా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.
ఇదీ చూడండి:బుసలు కొడుతున్న కరోనా.. నిబంధనలను గాలికొదిలేసిన ప్రజలు