తెలంగాణ

telangana

ETV Bharat / state

'తక్కువ సమయంలోనే తక్కువ ధరతో సరకులు రవాణా చేస్తాం'

ఉమ్మడి మెదక్​ జిల్లాలో తెలంగాణ ఆర్టీసీ సరకుల రవాణా కార్యక్రమాన్ని రీజనల్​ మేనేజర్​ రాజశేఖర్ ప్రారంభించారు. సరకులు, వస్తువులను తక్కువ సమయంలో తక్కువ ధరలకు వారి గమ్యస్థానాలకు చేరుస్తామని ఆయన తెలిపారు.

parcel services started by tsrtc at medak
ఆర్టీసీ సరుకుల రవాణా కార్యక్రమం ప్రారంభం

By

Published : Jun 27, 2020, 4:20 PM IST

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే మొట్టమొదటిసారి సరకుల రవాణా కార్యక్రమానికి జూన్​19న శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆర్టీసీ ఉమ్మడి మెదక్​ జిల్లా రీజనల్ మేనేజర్​ రాజశేఖర్​ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వాదేశాల మేరకు సంగారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఆర్టీసీ, రెవెన్యూ పెంచే దిశగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సరకులు, వస్తువులను తక్కువ సమయంలో తక్కువ ధరలకు వారి గమ్యస్థానాలకు చేర్చనున్నట్టు చెప్పారు.

కరోనా ప్రభావంతో ఆర్టీసీ చాలా నష్టపోయిందని.. బస్సులు ప్రారంభించినా ప్రయాణికులు తక్కువ మోతాదులో రావటం వల్ల రెవెన్యూ తగ్గిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details